
కొల్లాపూర్, వెలుగు: జాకీ పెట్టి లేపినా బీఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి లేదని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి మహనీయుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఖాదర్ బాషా దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరువు తెచ్చుకొని అభ్యర్థులను ప్రకటించుకొనే దుస్థితిలో బీజేపీ ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ సీటును భారీ మెజారిటీతో దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బచ్చలకూర బాలరాజు, ధర్మతేజ, వెంకటస్వామి పాల్గొన్నారు.