
పరకాల, వెలుగు : బీఆర్‌ఎస్ గడీల పాలనను అంతం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ, వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జి రవీందర్ దల్వీ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా పరకాలలోని స్వర్ణ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారన్నారు. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేయాలని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో అసెంబ్లీ క్యాండిడేట్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.