Champions Trophy 2025: ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. తుది జట్టులో బవుమాకు నో ఛాన్స్.. కారణం ఇదే!

Champions Trophy 2025: ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. తుది జట్టులో బవుమాకు నో ఛాన్స్.. కారణం ఇదే!

ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లాండ్ తో జరగనున్న ఈ చివరి లీగ్ మ్యాచ్ లో గెలిస్తే సౌతాఫ్రికా సెమీ ఫైనల్ కు చేరుతుంది. ఇలాంటి కీలక మ్యాచ్ లో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. టాస్ వేస్తున్న సమయంలో బవుమా స్థానంలో మార్కరం కెప్టెన్ గా వచ్చాడు. అయితే టాస్ సమయంలో బవుమా ఎందుకు ప్లేయింగ్ 11 లో లేడో మార్కరం వెల్లడించాడు. అనారోగ్యం కారణంగా బవుమా ఈ మ్యాచ్ కు దూరమవ్వాల్సి వచ్చిందని స్టాండింగ్ కెప్టెన్ మార్కరం తెలిపాడు. 

బవుమాతో పాటు టాప్ ఆర్డర్ బ్యాటర్ టోనీ డి జోర్జీ అనారోగ్యంతో ఉన్నట్టు తెలిపాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మార్క్ వుడ్ స్థానంలో సాకిబ్ మహమ్మద్ రానున్నాడు. మరోవైపు రెండు సౌతాఫ్రికా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కెప్టెన్ బావుమా, టోనీ డి జార్జి స్థానంలో క్లాసన్, స్టబ్స్ వచ్చారు. కరాచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ కు కీలకం కానుంది. ఇంగ్లాండ్.. సౌతాఫ్రికాపై 207 పరుగుల తేడాతో గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరుతుంది. లేకపోతే సౌతాఫ్రికా సెమీస్ కు చేరుతుంది. 

ALSO READ : IND vs NZ: ఒకటే మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న ఏడు రికార్డులు

మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ప్రస్తుతం 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (14), బ్రూక్ (12) ఉన్నారు. పవర్ ప్లే లో సఫారీ బౌలర్లు విజృంభించడంతో సాల్ట్ (8) తొలి ఓవర్ లోనే డకౌట్ గా వెనుదిరిగాడు. పేలవ ఫామ్ లో ఉన్న  జెమీ స్మిత్ డకౌటయ్యాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన డకెట్ 24 పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడు వికెట్లు మార్కో జాన్సెన్ తీసుకోవడం విశేషం.