ఐడెన్ మార్క్‌రమ్.. గత గత రెండు సీజన్ లుగా సన్ రైజర్స్ కెప్టెన్ గా అందరికీ పరిచయమే. అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ సఫారీ బ్యాటర్ కు ఏకంగా హైదరాబాద్ జట్టుకు కెప్టెన్సీ ఇచ్చారు. అయితే మార్కరం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. రెండు సీజన్ లలోనూ మార్కరం కెప్టెన్సీలో సన్ రైజర్స్ జట్టు ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ప్లే ఆఫ్ సంగతి పక్కన ఉంచితే కనీసం ఆ దిశగా కూడా అడుగులేయలేదు.
గత సీజన్ లో 14 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ ల్లోనే గెలిచి 10 ఓడిపోయింది. దీంతో అతనిపై SRH అతనిపై వేటు వేసింది. ఈ ఓటమికి కెప్టెన్ మార్కరం అనుభవం లేని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే అతని స్థానంలో ఆసీస్ సారధి కమిన్స్ ను కెప్టెన్ గా ప్రకటిస్తున్నట్లు నిన్న అధికారికంగా (మార్చి 4) ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మార్కరంకు ఒక కొత్త సమస్య వచ్చి చేరింది. కనీసం అతనికి తుది జట్టులో అవకాశం కూడా కష్టంగానే కనిపిస్తుంది.
ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టులో కెప్టెన్ కమ్మిన్స్ తో పాటు ట్రావిస్ హెడ్, క్లాసన్, మార్కో జాన్సెన్, హసరంగా, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వరల్డ్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. వీరు మార్కరం కు గట్టి పోటీ ఇవ్వొచ్చు. కొన్ని నివేదికల ప్రకారం తుది జట్టులో ఉండే నలుగురు విదేశీ ఆటగాళ్లలో కమ్మిన్స్, హెడ్, క్లాసన్, హసరంగా/జాన్సెన్ లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే మార్కరంకు నిరాశ తప్పకపోవచ్చు. మొత్తానికి కెప్టెన్సీ పోగొట్టుకున్న మార్కరంకు తుది జట్టులోనూ చోటు దక్కకపోతే అన్ లక్కీ అనే చెప్పాలి.
ALSO READ :- Tushar Arothe: క్రికెట్ బెట్టింగ్!.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఇంట్లో భారీగా నగదు
పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర రూ. 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా..సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరుపై పోటాపోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్ ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది. కెప్టెన్సీ కోసమే కమ్మిన్స్ ను భారీ ధరకు దక్కించుకున్నట్టు తెలుస్తుంది.
Pahle kaptaani gyi aur ab bench 🙁#srh #IPL2024 pic.twitter.com/AqP3JQjRPh
— Cricket Uncut (@CricketUncutOG) March 5, 2024