అందాల పోటీలకు వ్యతిరేకంగా ర్యాలీ

అందాల పోటీలకు వ్యతిరేకంగా ర్యాలీ

ముషీరాబాద్, వెలుగు: అందాల పోటీలు రద్దు చేయాలని కోరుతూ శనివారం సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), ట్రాన్స్ జెండర్ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. అందాల పోటీలు మహిళా సాధికారతకు సంకేతం కాదని, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

మహిళలను వినియోగ వస్తువుగా మారుస్తున్న సామ్రాజ్యవాద విష సంస్కృతిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.