భూ పోరాటాలను ఉధృతం చేస్తాం : సుభాషిణి అలీ

కాశీబుగ్గ, వెలుగు : రాష్ట్రంలో భూ పోరాటాలను ఉధృతం చేస్తామని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుభాషిణి అలీ చెప్పారు. ఐద్వా వరంగల్​ జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల అధ్యక్షతన సోమవారం వరంగల్‌‌‌‌‌‌‌‌ నగరంలోని పోచమ్మ మైదాన్‌‌‌‌‌‌‌‌ సమీపంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర మహిళలకు ఉందన్నారు. గుడిసెవాసులకు పక్కా ఇండ్ల పట్టాలు ఇచ్చే వరకు అండగా ఉంటామన్నారు. ప్రధాని మోదీ ఓట్ల కోసమే పర్యటనలు చేస్తున్నాడు తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని విమర్శించారు.