ఆల్ఫా స్కూల్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకోవాలి

ఆల్ఫా స్కూల్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకోవాలి
  • ఏఐఎఫ్ డీఎస్, ఏఐఎఫ్ డీవై నేతల డిమాండ్ 
  • మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతిపత్రం

మిర్యాలగూడ, వెలుగు : ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ను వాతలు వచ్చేటట్లు కొట్టిన నల్గొండ జిల్లా త్రిపురారంలోని ఆల్ఫా ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డీఎస్, ఏఐఎఫ్ డీవై నేతలు డిమాండ్ చేస్తూ.. సోమవారం  సబ్​కలెక్టర్ నారాయణ్ అమిత్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నేతలు పోతుగంటి కాశీ, వస్కుల కిరణ్ మాట్లాడుతూ.. హోంవర్క్ చేయలేదని ఇటీవల ఆల్ఫా స్కూల్ ఫస్ట్ క్లాస్ విద్యార్థిని కొట్టడడంతో  పేరెంట్స్ అడిగేందుకు స్కూల్ కువెళ్తే.. మేనేజ్ మెంట్ దురుసుగా ప్రవర్తించిందన్నారు.

స్కూల్ డ్రెస్, షూస్ వేసుకురాని విద్యార్థుల నుంచి రూ. 50 నుంచి 100 వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఆల్ఫా స్కూల్ అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఎంఈవో నిర్ధారించి జిల్లా అధికారులకు నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా అధికారులు ఆల్ఫా మేనేజ్ మెంట్ పై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరాహార దీక్షను చేపడతామని హెచ్చరించారు.  

ఆల్ఫా మేనేజ్ మెంట్ వేధింపుల నుంచి విద్యార్థులను కాపాడాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏఐఎఫ్ డీ ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇమ్మానియేల్,  సుజంధర్, ప్రశాంత్, రమేశ్, ప్రసాద్, రాజు ఉన్నారు.