ఫుట్‌బాల్ మహిళా క్రీడాకారిణుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మపై వేటు పడింది. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు జాతీయ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. తనపై వచ్చిన ఆరోపణలపై ప్యానెల్ దర్యాప్తు ముగిసే వరకు ఫుట్‌బాల్ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించింది.
అసలేం జరిగిందంటే..?
ఎఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన దీపక్ శర్మ.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఖాద్ ఫుట్‌బాల్ క్లబ్ క్రీడాకారిణుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఫుల్లుగా మద్యం సేవించి.. వారి హోటల్ గదిలోకి ప్రవేశించడమే కాకుండా.. బౌతికంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై క్రీడాకారిణులు ఫిర్యాదు చేయడంతో గోవా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.
ఇటీవల గోవా వేదికగా జరిగిన ఇండియన్ ఉమెన్స్ లీగ్ 2024 టోర్నీలో ఖాద్ ఫుట్‌బాల్ క్లబ్ పాల్గొంది. ఆ సమయంలో దీపక్ శర్మ హోటల్ గదిలో తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇద్దరు మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణు పోలీసులకు పిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన సమయంలో ఆయన ఫుల్లుగా తాగి ఉన్నారని, అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి గోవాకు వస్తోన్న సమయంలో కూడా తమ ముందే మద్యం తాగారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన మార్చి 28న జరగ్గా.. రెండ్రోజుల విచారణ అనంతరం గోవా పోలీసులు దీపక్ శర్మను అరెస్టు చేశారు. గాయపరచడం, మహిళపై బలవంతం చేయడం వంటి ఇతర ఆరోపణలతో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
All India Football Federation suspends its executive committee member Deepak Sharma for alleged physical assault on women players in Goa #AIFF pic.twitter.com/o2N91DFFfh
— Press Trust of India (@PTI_News) April 2, 2024