హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ మరో ముందుడుగు వేసింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ పేషెంట్లకు అధునాతన వైద్య సేవలు అందిస్తున్న ఏఐజీ హాస్పిటల్.. తాజాగా మరో లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులో కి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో వాడేందుకు అడ్వాన్స్డ్ ప్రోటాన్ బీమ్ థెరపీ ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేయాలని ఏఐజీ హాస్పిటల్స్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం రూ.800 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బెల్జియం కంపెనీ ఐబీఏ నుంచి ప్రోటాస్ వన్ ప్రోటాన్ థెరపీ సిస్టమ్‌ను, డైనమిక్ ఏఆర్‌సీని దక్కించుకునేందుకు ఏఐజీ బోర్డు ఆమోదం తెలిపింది. సౌత్ ఈస్ట్ ఏషియాలో తామే మొదటిసారిగా దీనిని అందుబాటులోకి తెస్తున్నామంది.