ఏఐహెచ్‌‌‌‌‌‌‌‌ హాకీ ప్రో లీగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా జట్ల ఓటమి

ఏఐహెచ్‌‌‌‌‌‌‌‌ హాకీ ప్రో లీగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా జట్ల ఓటమి

భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పెనాల్టీ కార్నర్లను గోల్స్‌‌‌‌‌‌‌‌గా మలచడంలో విఫలమైన ఇండియా మహిళల, పురుషుల జట్లు ఏఐహెచ్‌‌‌‌‌‌‌‌ హాకీ ప్రో లీగ్‌‌‌‌‌‌‌‌లో మరోసారి ఓడిపోయాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా అమ్మాయిలు 2–4 తేడాతో ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ పోరులో ఏకంగా 13 పెనాల్టీ కార్నర్లు లభించగా రెండింటిని ఉదితా (18, 42వ నిమిషాల్లో)  గోల్స్‌‌‌‌‌‌‌‌గా మలిచింది. 

డచ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఫెలైస్‌‌‌‌‌‌‌‌ (34, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టగా.. రీనెన్ (7వ ని), వాండర్ ఎస్ట్‌‌‌‌‌‌‌‌ (40వ ని) ఒక్కో గోల్‌‌‌‌‌‌‌‌తో తమ జట్టును గెలిపించారు. మరోవైపు ఇండియా పురుషుల జట్టు 3–4 తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆతిథ్య జట్టులో అభిషేక్ (18వ ని), సుఖ్‌‌‌‌‌‌‌‌జీత్ సింగ్ (39వ ని) చెరో గోల్ కొట్టారు. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ సామ్ వార్డ్ (19, 24వ ని.) రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌ కొట్టగా.. జాకబ్ (15వ ని) ఓ గోల్ చేశాడు.