గ్రూప్-బి, సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందుతోంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) 4వేల 597 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ఫార్మసిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్ వంటి మొత్తం 66 విభాగాల్లో ఈ భర్తీలు చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 4,597
అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ఫార్మసిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్, స్టోర్ కీపర్, ఈసీజీ టెక్నిషియన్, ప్లంబర్, పెయింటర్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ వంటి 66 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదేని డిగ్రీ(BE/B.Tech అర్హులే), పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
వయో పరిమితి: పోస్టులను బట్టి అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయస్సులో సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/OBC అభ్యర్థులు రూ.3000.. SC/ST/EWS అభ్యర్థులు రూ.2400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఎంపిక పక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఎయిమ్స్ బీబీనగర్(యాదాద్రి, తెలంగాణ), ఎయిమ్స్ ఎంజీ క్యాంపస్ (మంగళగిరి, ఏపీ)
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07/ 01/ 2025
- దరఖాస్తులకు చివరి తేది: 31/ 01/ 2025
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2025, ఫిబ్రవరి 26 నుండి 28 మధ్య
- ఫలితాల విడుదల: మార్చి, 2025
నోటిఫికేషన్, దరఖాస్తు చేయడం కోసం AIIMS న్యూఢిల్లీ అధికారిక వెబ్‌సైట్ https://aiimsexams.ac.in/ని సందర్శించండి.