పన్ను వసూళ్లలో టాప్ .. రాష్ట్రంలో నాల్గవ స్థానంలో నిలిచిన అయిజ మున్సిపాలిటీ

పన్ను వసూళ్లలో టాప్ .. రాష్ట్రంలో నాల్గవ స్థానంలో నిలిచిన అయిజ మున్సిపాలిటీ

అయిజ, వెలుగు: ఆస్తి పన్ను వసూళ్లలో అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలో నాల్గవ స్థానంలో నిలిచిందని కమిషనర్  సైదులు తెలిపారు. సోమవారం కార్యాలయం ఎదుట సంబురాలు చేసుకున్నారు. సిబ్బందిని కమిషనర్​ అభినందించి మాట్లాడారు. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.82 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.1.62 కోట్లు వసూలు చేశామని తెలిపారు. అయిజ మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులు పొందే అర్హత లభించిందన్నారు. 

మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో పన్నులు వసూలు కాలేదన్నారు. పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయడమే లక్ష్యంగా పని చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. పన్ను వసూళ్లలో సిబ్బంది శ్రమించారని తెలిపారు. ఆర్ఐ విజయ్, ఆర్వో లక్ష్మన్న, సిబ్బంది రామకృష్ణ, అడివన్న, మహేంద్రనాథ్, నాగరాజు, నరేశ్, ఆంజనేయులు, వీరేశ్​ పాల్గొన్నారు.