హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న వెటరన్ ఫుట్‌బాల్ ప్లేయర్ డీఎంకే అఫ్జల్‌కు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసింది. 1962 జకర్తాలో ఆసియాడ్‌లో ఇండియా స్వర్ణం సాధించిన జట్టులో అఫ్జల్ మెంబర్‌గా ఉన్నారు. గోల్కొండ రిసాల బజార్‌లో అఫ్జల్ ఇంటికి వెళ్లి చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీ బాలాదేవిలు చెక్‌ను అందజేశారు.
దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకొచ్చి ప్రస్తుతం ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వెటరన్ ప్లేయర్లను ఆదుకోవడానికి స్పోర్ట్స్ పాలసీలో స్పష్టమైన నిబంధనలు రూపొందిస్తామని శివసేనా రెడ్డి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వెటరన్ ప్లేయర్లు షబ్బీర్ అలీ, విక్టర్ అమూల్ రాజ్, ప్రజా సంబంధాల అధికారి సురేష్ కాలేరు తదితరులు పాల్గొన్నారు. తమ ఆర్థిక పరిస్థితిని గమనించి సహకారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్‌కు అఫ్జల్ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.