మాకు రెండు పార్టీలతో పొత్తు కుదిరింది

తాము ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు ఉంటారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పెట్టుకునే పొత్తులను ఆయన ప్రకటించారు. తమ పార్టీ రెండు పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. బాబు సింగ్ కుష్వాహ, భారత్ ముక్తి మోర్చాతో తమ పార్టీ పొత్తు కుదిరిందని ఒవైసీ ప్రకటించారు. అయితే యూపీ ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే.. ఇద్దరు సీఎంలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు.  సీఎంలలో ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు కాగా.. మరొకరు దళిత వర్గానికి చెందిన వారు ఉంటారని ఆయన తెలిపారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంలు కూడా ముగ్గురు ఉంటారని.. వారిలో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారు ఉంటారని అసదుద్దీన్ తెలిపారు.

For More News..

తెలంగాణలో ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదు

దేశాలు దాటిన ‘పుష్ప’ క్రేజ్

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేటీఆర్ డ్రామాలు