యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తాం

యూపీ ఎన్నికల పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. యూపీ ఎన్నికల్లో వంద సీట్లలో పోటీ చేస్తామన్నారు అసద్. రాబోయే యుపి అసెంబ్లీ ఎన్నికల కోసం 100 స్థానాల్లో పోటీకి తామ సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇతర దశలకు మరింత మంది అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వర్చువల్ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) కూటమి  వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం 29 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పశ్చిమ యూపీలోని స్థానాల అభ్యర్థుల లిస్ట్ వెల్లడించింది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 10 మరియు 14 తేదీల్లో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 29 స్థానాల్లో ఆర్‌ఎల్‌డీ 19 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎస్పీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.మొత్తం  ఏడు విడతల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10 న విడుదల కానున్నాయి. 

ఇవి కూడా చదవండి: 

ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్

రేపటి నుంచి వర్చువల్ గా కేసుల విచారణ