టార్గెట్.. 100 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలు

టార్గెట్.. 100 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలు

న్యూఢిల్లీ: మనదేశం సంవత్సరానికి కనీసం 100 బిలియన్ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్ల (ఎఫ్‌‌డీఐల) ను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏటా 100 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలు తమ లక్ష్యమని పరిశ్రమ  అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. గత మార్చి వరకు  ఐదు సంవత్సరాలలో వార్షిక సగటు 70 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 100 బిలియన్ డాలర్ల లక్ష్యానికి  దగ్గరగా ఉంటుందని సింగ్ చెప్పారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ తమ కార్యకలాపాలను మరింత విస్తృతంగా విస్తరించడం ద్వారా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించాలనుకునే వ్యాపారాలను ఆకర్షిస్తోంది. చాలా కంపెనీలు " చైనా ప్లస్ వన్” వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

యాపిల్, శామ్​సంగ్​ వంటి కంపెనీలు కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని భారతదేశంలో తయారీని పెంచాయి.  అభివృద్ధి చెందిన దేశాలలో అధిక ద్రవ్యోల్బణం, ఎక్కువ  వడ్డీ రేట్లు,  భౌగోళిక రాజకీయ వైరుధ్యాల వల్ల కూడా పెట్టుబడిదారులు మనదేశానికి వస్తున్నారని రాజేష్​ వివరించారు.