వచ్చే ఐనవోలు మల్లన్న జాతర కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే : అద్దంకి దయాకర్ 

వరంగల్ : ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కీలక కామెంట్స్ చేశారు. దేశం, రాష్ట్రంలో రాజకీయ కక్షలు పెరగకుండా.. ప్రజాస్వామ్య వాతావరణం వచ్చేలా చూడాలని మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు. ప్రజలు మెచ్చే పాలన అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. భక్తి పేరుతో ప్రజల్లో వైషమ్యాలు పెంచే తీరు, రెచ్చగొట్టే విధానం నాయకుల్లో మారాలన్నారు.

అన్ని మతాలను గౌరవించి.. ప్రేమతో పరిపాలించే విధానం రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు అద్దంకి దయాకర్ చెప్పారు. వచ్చే ఐనవోలు మల్లన్న జాతర కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేలా ఆశీర్వదించాలని మల్లన్నను కోరుకున్నానని అన్నారు. ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.