డీప్​ ఫ్రీజర్లను లాంచ్​ చేసిన బ్లూస్టార్

డీప్​ ఫ్రీజర్లను లాంచ్​ చేసిన బ్లూస్టార్

హైదరాబాద్​, వెలుగు : ఎయిర్ కండిషనింగ్  కమర్షియల్ రిఫ్రిజిరేషన్ కంపెనీ బ్లూ స్టార్ లిమిటెడ్ తన కొత్త డీప్ ఫ్రీజర్లను హైదరాబాద్​లో శుక్రవారం లాంచ్​ చేసింది. మహారాష్ట్ర వాడాలోని తన కొత్త ప్లాంటులో వీటిని తయారు చేశామని ప్రకటించింది. తమకు హిమాచల్ ప్రదేశ్, అహ్మదాబాద్, దాద్రా (గుజరాత్), వాడా (మహారాష్ట్ర), శ్రీసిటీ (ఆంధ్రప్రదేశ్)లో  ప్లాంట్లు ఉన్నాయని, ఈ ఏడాది మొత్తం కంపెనీ ఆదాయం  రూ. 8,200 కోట్లకు వరకు ఉండొచ్చని బ్లూ స్టార్ ఎండీ త్యాగరాజన్ ప్రకటించారు.

కమర్షియల్ రిఫ్రిజిరేషన్‌‌‌‌లో కంపెనీ మార్కెట్ వాటా 38 శాతం, వాటర్ కూలర్లలో 32 శాతం, డీప్ ఫ్రీజర్లలో 29 శాతం ఉంది.   ‘‘ఈ ఏడాదే శ్రీ సిటీలోని తన యూనిట్‌‌లో రూమ్ ఎసీల ప్రొడక్షన్​ను మొదలుపెట్టాం. దీనిని రూ. 350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశాం. ఫేజ్–2 కోసం దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడి పెడతాం. ఇక్కడే ఏసీల తయారీ కోసం దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టి 40 ఎకరాల భూమిని కొన్నాం. కమర్షియల్ ఏసీల ప్లాంటు నిర్మాణ పనులు 2024 నుంచి ప్రారంభమవుతాయి. శ్రీసిటీ ప్రొడక్షన్ యూనిట్ నుంచి మిడిల్ ఈస్ట్ మార్కెట్‌‌కు ఎగుమతులు  చేయాలన్న ప్రపోజల్​ పరిశీలనలో ఉంది”అరి  త్యాగరాజన్​ వివరించారు.