45 మంది డెడ్‌బాడీలు ఫ్లైట్‌లో ఇండియాకు

కువైట్ ఫైర్ యాక్సిడెంట్‌లో  చనిపోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానం కేరళకు బయలుదేరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ డెడ్ బాడీలతో కేరళాలోని కొచ్చి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుంది. కొచ్చి ఎయిర్ పోర్ట్ లో భారీగా పోలీసులు మోహరించారు. కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విమానంలో ఉన్నారు. 

దక్షిణ కువైట్ లోని మంగాఫ్ లో 196 మంది వలస కార్మికులు పని చేస్తు్న్న 7 అంతస్థుల బిల్డింగ్ లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ హోర విషాదం ఘటనలో 49 మంది మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు ఫిలిప్పీన్స్, 45 మంది ఇండియన్స్ గా గురువారం చనిపోయిన వారిని గుర్తించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని కువైట్‌ ఫైర్‌ ఫోర్స్‌ తెలిపింది. మరణించిన వారి మృతదేహాలకు కువైట్ అధికారులు DNA టెస్టులు వారి డెడ్ బాడీలను గుర్తించారు.