
కామారెడ్డి జిల్లాలో గన్ పని తీరును వివరిస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. లింగంపేట మండలం శెట్‌పల్లి సంగారెడ్డి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎయిర్‌గన్ పేలి బోదనపు రాజు అనే యువకుడికి గాయాలయ్యాయి. వ్యవసాయ క్షేత్రంలో శ్రీకాంత్ అనే వ్యక్తి సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో స్నేహితుడైన రాజుకు వ్యవసాయ క్షేత్ర యజమానికి చెందిన ఎయిర్ గన్ పనితీరును వివరిస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు పేలింది. దీంతో రాజు వీపు భాగంలో తీవ్ర గాయమైంది. రాజును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.