న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతిలో పైలెట్ల ట్రెయినింగ్ కోసం ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఏడాదికి 180 మంది కమర్షియల్ పైలెట్లకు శిక్షణ ఇస్తామని తెలిపింది. అమరావతి ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉన్న ఫ్లైట్ ట్రెయినింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీఓ) సౌత్ ఆసియాలో అతిపెద్ద పైలెట్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా నిలుస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్‌లో అందుబాటులోకి వస్తుందని ఎయిర్ ఇండియా ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.మొత్తం 31 సింగిల్ ఇంజిన్ విమానాలు, 3 ట్విన్ ఇంజిన్ విమానాలు ట్రెయినింగ్ కోసం అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఫెసిలిటీని 30 ఏళ్ల పాటు ఆపరేట్ చేసేందుకు అనుమతులు పొందింది.