గుడ్ న్యూస్..ఇప్పటివరకు మనం ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో, మెట్రో రైళ్లలోఉచిత వైఫై(Wi-Fi) చూశాం.. అయితే ఇప్పుడు ఆకాశంలో ఎగిరే విమానంలో కూడా వైఫై అం దుబాటులోకి వస్తోంది. మొట్టమొదటి సారిగా ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థ తమ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఆన్ బోర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పిస్తోంది.
ప్రైవేట్ క్యారియర్ ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ విమానాలలో Wi-Fi ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలను బుధవారం (జనవరి 1, 2025) నాడు అందుబాటులోకి తెచ్చింది. తన వైడ్‌బాడీ ఎయిర్‌బస్ A350 , బోయింగ్ 787-9 ఫ్లీట్‌తో పాటు ఎంపిక చేసిన ఎయిర్‌బస్ A321neo విమానాలలో ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. విమానాలలో ఇటువంటి సేవలను అందించే మొదటి ఎయిర్‌లైన్‌గా ఎయిరిండియా నిలిచింది.
iOS, Android ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్లు, టాబ్లెట్స్ పీసీలు, స్మార్ట్ ఫోన్లకు వైఫై అందుబాటులో ఉంటుంది. 10వేల ఫీట్ల ఎత్తులో విమానం వెళ్తున్నప్పుడు ఏకకాలంలో మల్టిపుల్ డివైజ్ లకు వైఫై కనెక్టివిటీ ఉంటుంది.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా దేశీయంగాఎయిర్ బస్ A350 ద్వారా ఈ వైఫై సేవలను అందిస్తోంది.త్వరలో ఎయిర్ ఇండియాకు చెందిన అన్ని విమానాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.