- 1.7 కిలోల గోల్డ్ స్వాధీనం
చెన్నై: గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ ఇండియా ఉద్యోగి ఒకరు పట్టుబడ్డారు. ఓ ప్యాసింజర్ ఇచ్చిన గోల్డ్ ను ఆ ఉద్యోగి తన లోదుస్తుల్లో దాచి తీసుకొచ్చారు. వీళ్లిద్దరినీ చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. ఈ నెల 15న దుబాయ్ నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చింది. అందులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది.
దీంతో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఓ ప్యాసింజర్, క్యాబిన్ క్రూ మెంబర్ ఒకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్యాసింజర్ ను ప్రశ్నించగా క్యాబిన్ క్రూ మెంబర్ కు విమానంలో బంగారం ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. దీంతో క్యాబిన్ క్రూ మెంబర్ వద్ద వెతకగా, లోదుస్తుల్లో బంగారం దొరికింది. మొత్తం 1.7 కిలోల 24 క్యారెట్ గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిందితులిద్దరినీ జ్యూడీషియల్ రిమాండ్కు తరలించామని చెప్పారు.