8 ఎయిర్ ఇండియా ఫ్లైట్లు రద్దు

శంషాబాద్, వెలుగు: టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో 8 ఫ్లైట్లను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూర్, వైజాగ్, మైసూర్ వెళ్లాల్సిన విమానాలతో పాటు చెన్నై, తిరుపతి, బెంగళూర్, మైసూర్ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో ఫ్లైట్లు రద్దు చేయడంతో ప్యాసింజర్లు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఎయిర్ ఇండియా మేనేజ్ మెంట్ టికెట్ డబ్బులను ప్యాసింజర్లకు తిరిగి చెల్లించింది. దీంతో ప్యాసింజర్లు ఆందోళన విరమించారు.