అక్టోబర్ 14 వరకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు కొనసాగుతుండటంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్కు అక్టోబర్ 14 వరకు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు, ఎయిర్ ఇండియా సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు అవసరమైన సపోర్ట్ అందిస్తామని తెలిపింది.
ఇజ్రాయిల్ -పాలస్తీనా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేస్తున్నారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేలకు పైగా రాకెట్లతో దాడులు చేశారు. అంతేకాకుండా రోడ్డు మార్గంలో సరిహద్దుల్లో ప్రవేశించి ఆరాచాకాలకు తెగబడ్డారు. హమాస్ ఉగ్రవాదుల దాడికి ప్రతీగా ఇజ్రాయిల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' ప్రారంభించింది. గాజా తీరప్రాంతంపై వైమానిక దాడి చేసింది. ఇజ్రాయిల్‌లోకి చొరబడిన తీవ్రవాదులు.. అక్కడి మహిళలను నగ్నంగా ఈడ్చుకుంటూ వెళ్లారు.
ALSO READ : ఇదేమి కాలంరా బాబూ: విశాఖలో కాక రేపుతున్న భానుడు
ఇజ్రాయిల్ లో భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని ..ఏదైనా సాయం అవసరమైతే రాయబార కార్యాలయాలన్ని సంప్రదించాలని సూచించింది. ఇజ్రాయిల్‌లో ఉన్న భారత పౌరులందరూ స్ధానిక అధికారులు నిర్ధేశించిన భద్రతా ప్రమాణాలను అనుసరించాలని కోరింది. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అనవసరంగా బయటతిరగకుండా జాగ్రత్తలు పాటించాలని గైడ్‌లైన్స్‌లో సూచించింది.