తెలంగాణ, ఏపీ నుంచి విమానాలను పెంచిన ఎయిర్ ఇండియా

తెలంగాణ, ఏపీ నుంచి  విమానాలను పెంచిన ఎయిర్ ఇండియా

హైదరాబాద్, వెలుగు: ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌ప్రెస్ తమ శీతాకాల షెడ్యూల్‌‌‌‌లో భాగంగా హైదరాబాద్, విజయవాడ,  విశాఖపట్నం నుంచి విమానాల సంఖ్యను 45 శాతం పెంచినట్టు ప్రకటించింది.  గత శీతాకాలంలో వారానికి 173 వీక్లీ విమానాలను నడపగా, ఈ సీజన్‌‌‌‌లో  విమానాల సంఖ్యను 250కి పెంచింది.  ఈ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌‌‌‌ను గ్వాలియర్‌‌‌‌తో,  విశాఖపట్నంను విజయవాడతో కలిపే కొత్త రూట్లు ఉన్నాయి. 

హైదరాబాద్ నుంచి బెంగళూరు,  కొచ్చికి వెళ్లే మార్గాల్లో ఫ్రీక్వెన్సీలు పెరిగాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ చెప్పారు. దాదాపు 200 వీక్లీ విమానాలతో హైదరాబాద్ తమ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో మూడవ అతిపెద్ద స్టేషన్‌‌‌‌గా నిలుస్తోందన్నారు. హైదరాబాద్ నుంచి 17 దేశీయ నగరాలకు,  సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన విమానాశ్రయాలకు విమానాలను నడుపుతున్నామని ఆయన వివరించారు.   హైదరాబాద్ నుంచి దాదాపు 200 వీక్లీ విమానాలను నడుపుతున్నామని గార్గ్​ చెప్పారు.