న్యూఢిల్లీ: థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్, ఫుకెట్‌కు విమాన సర్వీస్‌లను మొదలు పెట్టాలని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 14 ఇంటర్నేషనల్ సిటీలకు ఇండియా నుంచి సర్వీస్‌లను నడుపుతోంది. ఇందులో మెజార్టీ సిటీలో మిడిల్ ఈస్ట్‌లో ఉన్నాయి. ఇండియాలోని 35 డెస్టినేషన్లకు విమాన సర్వీస్‌లను నడుపుతోంది.
మొత్తం 90 విమానాలను, రోజుకి 400 కి పైగా విమాన సర్వీస్‌లను ఆపరేట్ చేస్తోంది. జుమ్మూ, శ్రీ విజయ పురం (పోర్ట్ బ్లెయర్) కు డిసెంబర్ 1 నుంచి సర్వీస్‌లు మొదలు పెడతామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే ప్రకటించింది.