ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మనసు మార్చుకుంది. తొలగించిన 35 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించింది. సిక్ లీవ్ పేరుతో ఊకుమ్మడిగా ఉద్యోగులు సెలవులు పెట్టడంతో ఎయిర్ ఇండియా దాదాపు 175 విమానాలను రద్దు చేసుకుంది. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో సెలవులో ఉన్న 35 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.తొలగించబడిన కొద్ది గంటల్లోనే క్యాబిన్ క్రూ ఉద్యోగులందరిని తిరిగి విధుల్లో చేర్చుకునేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అంగీకరించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన చీఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది ఎటువంటి నోటీసులు లేకుండా సిక్ లీవ్ పెట్టడంతో అనేక విమానాలు రద్దు చేశారు. చాలా విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. .
క్యాబిన్ సిబ్బంది కొరతతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ 85 విమానాలను రద్దు చేసింది. రోజువారీ షెడ్యూల్ విమానాల్లో 20 శాతం ప్రభావం చూపింది. 20 రూట్లలో ఎయిర్ ఇండియా మద్దతుతో 283 విమానాలను నడుపుతున్నట్లు ఎయిర్ లైన్ తెలిపింది. ఉద్యోగులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడంతో క్యాబిన్ క్రూ వివాదానికి తెరపడింది.. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమాన సర్వీసులనుతిరిగి పెంచే అవకాశం ఉంది.