Air India Flight: ఎయిర్ ఇండియా ప్యాసింజర్ ఫుడ్ లో బ్లేడ్.. వీడియో వైరల్ 

Air India Flight: ఎయిర్ ఇండియా ప్యాసింజర్ ఫుడ్ లో బ్లేడ్.. వీడియో వైరల్ 

ఎయిర్ ఇండియాలో మెయింటెనెన్స్ సంబంధించిన వరుస వివాదాలు  తలెత్తుతున్నాయి.. నిన్న ఎయిర్ ఇండియా విమానంలో బ్యాడ్ ఫుడ్, డర్టీ సీట్స్ తో ఓ ప్యా సింజర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఏకంగా ఇకపై ఎయిర్ ఇండియా విమనాలను వినియోగిం చం అంటూ పోస్ట్ లు కూడా పెట్టారు.. ఇదిలా ఉండగానే మరో సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది. మెయింటెనెన్స్ కు సంబంధించి మరో పోస్ట్ సోష ల్ మీడియాలో వైరల్ అవుతోంది..పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 175 లో బెంగళూ రు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న  మ్యాథ్యూర్స్ పాల్ అనే ప్యాసింజర్ తనకు సర్వ్ చేసిన భోజనంలో మెటల్ బ్లేడ్ వచ్చిందని ఫొటోలను షేర్ చేశాడు. అతను రోస్టెడ్ స్వీట్ పొటాటో, ఫిగ్ చాట్ ఆర్డర్ చేయగా అందులో ఇనుప బ్లేడ్ ప్రత్యక్షమయింది. దీంతో పాల్ షాక్ కు గురయ్యాడు. వెంటనే తేరుకొని ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ మెయింటెనెన్స్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.
 
‘‘ఎయిర్ ఇండియా ఫుడ్ కత్తిలా కోస్తుంది.. రోస్టెడ్ ఫొటాలో , ఫిగ్ చాట్ లో మెటల్ బ్లేడ్ లాంటిది వచ్చింది.. నేను రోస్ట్ ను నమిలిన కొన్ని క్షణాల తర్వాత బ్లేడ్ ను గుర్తించాను. నా అదృష్టం బాగుండి ఎలాంటి హాని జరగలేదు. ఇది పూర్తిగా ఎయిర్ ఇండియా క్యాటరింగ్ సర్వీస్..కానీ ఎయిర్ ఇండియా తప్పేమీ లేదన్నట్లుగా పోస్ట్ చేశాడు. 

ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా గుర్తించింది. విచారణను చేపట్టింది. కూరగాయలు కట్ చేసే ప్రాసెస్ లో ఇది జరిగిందని గుర్తించారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు.