విమానంలో సర్వ్ చేసిన ఫుడ్లో బొద్దింక..ప్యాసింజర్కు ఫుడ్ పాయిజనింగ్

విమానంలో సర్వ్ చేసిన ఫుడ్లో బొద్దింక..ప్యాసింజర్కు ఫుడ్ పాయిజనింగ్

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ అస్వస్థతకు గురైంది. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఎండియా విమానంలో సర్వ్ చేసిన ఫుడ్ లో బొద్దింక కలిసింది. అది గమనించక ప్రయాణికురాలు తినడంతో అస్వస్థతకు గురైంది. ఎయిర్ ఇండియా విమానంలో ఎదురైన చెత్త అనుభవాన్ని ప్యాసింజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. 

ఢిల్లీకి చెందిన సుయేషా సావంత్ తన రెండేళ్ల కొడుకుతో ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె తన కొడుకు కోసం ఆమ్లెట్ ఆర్డర్ చేసింది.ప్రయాణంలో ఆమ్లెట్ లో బొద్దింక కనిపించిందని సుయేషా పోస్ట్ లో రాసింది..సగం తిన్న తర్వాత  బొద్దింక కనిపించడం ఆందోళనకు గురైంది. స్వల్ప అస్వస్థతకు గురైనట్లు పోస్టులో రాసింది. విమానంలో తన కష్టాలను తెలియజేస్తూ సుయేషా సోషల్ మీడియా ప్లాట్ ఫారంX లో పోస్ట్ చేసింది. 

సుయేషా తనకు ఎదురైన చెత్త అనుభవాన్ని సెప్టెంబర్ 28న షేర్ చేసింది. అప్పటినుంచి 20వేల కంటే ఎక్కువమంది చూశారు. ఎయిర్ ఇండియా అథారిటీ కూడా స్పందించింది. సుయేషాకు రిప్లై కూడా ఇచ్చారు. మీకు ఎదురైన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం.. మీ బుకింగ్ వివరాలను DMకు షేర్ చేయండి దర్యాప్తు చేస్తామని రాశారు. 

ఇక నెటిజన్లు స్పందిస్తూ.. విమానాల్లో తరుచుగా వారికి ఎదురైన అనుభవాలను షేర్ చేశారు. కొందరైతే ఆహార భద్రతపై లెక్చర్లు ఇచ్చారు. ప్రయాణాల్లో అందించే ఫుడ్ విషయాల్లో చెకింగ్ కట్టుదిట్టంగా ఉండాలని సూచిస్తున్నారు. విమానాల్లో తక్కువ లైటింగ్ ఉంచి ఆహారాన్ని సర్వ్ చేస్తున్నారు. అందులో ఏం వచ్చిందో కూడా చూసుకునే పరిస్థితి లేదు.. ఈ పద్దతి మారాలి అంటూ పోస్ట్ చేశారు.

మరో నెటిజన్ స్పందిస్తూ ఎయిర్ ఇండియావిలీనానికి ముందుకు ఉద్యోగులను రిప్లేస్ చేయాలని ప్రపోజల్ పెట్టాడు. ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. ఈ రోజుల్లో ఎయిర్ లైన్స్ అయినా.. రైల్వే క్యాటరింగ్ అయినా లేదా హాస్టళ్లో వడ్డించే ఫుడ్ అయినా, పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అయినా విదేశీ వస్తువులు లేకుండా ఉండటం లేదు..  అందుకే వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ అవుతున్నాయంటూ రాశారు.