
ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. విమానంలో ప్రయాణికుడి చేసిన వింత చేష్టలతో తోటి ప్రయాణికుడి బట్టలు, వస్తువులు తడిసి కంపు లేపాయి. ఈ సంఘటనతో ప్రయాణికులు, విమాన సిబ్బంది అవాక్కయ్యారు. ఢిల్లీనుంచి బ్యాంకాక్కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన బుధవారం (ఏప్రిల్9) చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే..
ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI2336 బోయింగ్ విమానంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై ఎయిర్ ఇండియా డీజీసీఐకి ఫిర్యాదు చేసింది.సంఘటనపై విచారణకు స్టాండింగ్ ఇండిపెండెంట్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
►ALSO READ | కేంద్ర మంత్రి మనవరాలిని నాటు తుపాకీతో కాల్చి చంపిన భర్త
ఈ విషయంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థతో మాట్లాడి తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.