పూణే విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

పూణే విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

చెన్నై నుండి పూణే వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. శనివారం చెన్నై నుండి పూణే బయలుదేరిన ఎయిర్ ఇండియా ఐఎక్స్ 555 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ లో ల్యాండ్ అయ్యింది. విమానం టేక్ ఆఫ్ అయ్యాక సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించాడు.

విమానంలో ఫ్యూయల్ తక్కువగా ఉండటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి దారి మళ్లించినట్లు తెలుస్తోంది. పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయటంతో ప్రమాదం తప్పింది. ప్రయాణం సమయంలో విమానంలో 180 మంది ప్యసింజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా పైలట్ కి కృతఙ్ఞతలు తెలిపారు.

Also Read :- లారీని ఢీకొన్న మినీ వ్యాన్.. నలుగురు స్పాట్ డెడ్

అయితే.. శంషాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత ఫ్యూయల్ నింపుకొని మళ్ళీ పూణేకి బయలుదేరింది ఎయిర్ ఇండియా విమానం. విమానంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సిబ్బంది స్పష్టం చేశారు.