న్యూఢిల్లీ: విమానాల ఇంజిన్‌ను ఆన్ చేయకుండానే ఎయిర్‌పోర్టుల దగ్గర ఫ్లయిట్లను టెర్మినల్ గేట్ డైరెక్షన్ నుంచి మార్చడానికి వాడుతున్న ట్యాక్సిబాట్ సర్వీస్‌లను ఎయిర్ ఇండియా కూడా ఉపయోగించుకోవడానికి రెడీ అయ్యింది. బెంగళూరు, ఢిల్లీ ఎయిర్‌పోర్టులలో ట్యాక్స్‌బాట్ సర్వీస్‌లను కంపెనీ వాడనుంది. ఇందుకోసం కేఎస్‌యూ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
రానున్న మూడేళ్లలో 15 వేల టన్నుల జెట్ ఫ్యూయల్ ఆదా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్ ఇండియా ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. కార్బన్ ఎమిషన్స్‌ను తగ్గించుకోవడానికి, సస్టయినబిలిటీ మెరుగుపరుచుకోవడానికి గల అవకాశాలను కంపెనీ నిరంతరం వెతుకుతోందని ఎయిర్ ఇండియా సీఈఓ అండ్ ఎండీ కాంప్బెల్ పేర్కొన్నారు. ట్యాక్సిబాట్స్ సామర్ధ్యాలను మరింతగా విశ్లేషించడానికి కేఎస్‌యూతో కుదిరిన ఒప్పందం సాయపడుతుందని చెప్పారు. భవిష్యత్‌లో ఎయిర్ ఇండియా సబ్సిడరీలకు, ఇతర ఎయిర్ పోర్టులకు కూడా వీటి సర్వీస్‌లను విస్తరించొచ్చన్నారు.