కొత్త ఎయిర్ఫోర్స్(IAF) చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్..సెప్టెంబర్ 30న ప్రమాణం

కొత్త ఎయిర్ఫోర్స్(IAF) చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్..సెప్టెంబర్ 30న ప్రమాణం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా అమర్ ప్రీత్ సాంగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో అమర్ ప్రీత్ సాంగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 

ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ఉన్న అమర్ ప్రీత్ సింగ్ ను ఎయిర్ స్టాఫ్ తదుపరి చీఫ్ గా  కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2024, సెప్టెంబర్ 30న వివేక్ రామ్ చౌదరి పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు అమర్ ప్రీత్ సింగ్ ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాను స్వీకరిస్తారు. 

2023, ఫిబ్రవరి 1నుంచి భారత వైమానిక దళానికి వైస్ చీఫ్ గా ఎయిర్  మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1984లో భారత వైమానిక దళంలో చేరిన అమర్ ప్రీత్ సింగ్.. తొలిసారి IAF ఫైటర్స్ స్ట్రీమ్ లో ప్రవేశించారు. వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ ఎయిర్ కమాండ్ (CAC)కి కమాండ్ తీసుకునే ముందు అమర్ ప్రీత్ సింగ్.. తూర్పు ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 

ALSO READ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణం

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లో పూర్వ విద్యార్థి అయిన సింగ్.. మిగ్-27 స్క్వాడ్రన్‌లో ఫ్లైట్ కమాండర్ , కమాండింగ్ ఆఫీసర్, ఎయిర్ బేస్ కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్‌తో సహా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2019లో అతి విశిష్ట సేవా పతకం , 2023లో పరమ విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నారు అమర్ ప్రీత్ సింగ్.