భారత కొత్త ఎయిర్ చీఫ్ మార్షల్ గా రాకేశ్ కుమార్ సింగ్

భారత కొత్త ఎయిర్ చీఫ్ మార్షల్ గా రాకేశ్ కుమార్ సింగ్ బదూరియా చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. రాకేశ్ కుమార్ సింగ్ ను అభినందించారు.

తర్వాత ఇద్దరూ IAF సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ధనోవాకు IAF సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. అధికారులందరితో ఆయన కరచాలనం చేశారు. ఉదయం వార్ మెమోరియల్ వద్ద అమరజవాన్లకు నివాళి అర్పించారు ధనోవా.