హమ్మయ్యా..ఈ దీపావళికి హైదరాబాద్లో తగ్గిన ఎయిర్​ పొల్యూషన్​

హమ్మయ్యా..ఈ దీపావళికి హైదరాబాద్లో తగ్గిన ఎయిర్​ పొల్యూషన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: గతేడాదితో పోలిస్తే సిటీలో ఈ దీపావళికి వాయుకాలుష్యం కొంత తగ్గింది. అయినప్పటికీ గాలిలో నాణ్యత (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి దిగజారినట్లు తెలంగాణ పీసీబీ పేర్కొంది. పీసీబీ పరిమితుల ప్రకారం.. గాలిలో పీఎం 2.5 తీవ్రత 40 మైక్రో గ్రాములకు మించకూడదు. కానీ, దీపావళి రోజు పీఎం 2.5 యావరేజ్84కు చేరింది. గతేడాది ఇది 119 గా నమోదైంది.

 వాయుకాలుష్యంపై ప్రజల్లో అవగాహన, గ్రీన్​క్రాకర్స్ అందుబాటులోకి రావడం, అధిక రేట్లు, దీపావళి రోజు పటాకులు కాల్చేందుకు సిటీ పోలీసులు కేవలం 2గంటలు మాత్రమే అవకాశం ఇవ్వడం వంటివి గతేడాదితో పోలిస్తే ఈసారి వాయుకాలుష్యం కొంత తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.

 ఇక సౌండ్ పొల్యూషన్ విషయానికికొస్తే రాత్రి– పగలు (69.4–64.5డీబీ) శబ్ద స్థాయిలు ఒకేరకంగానే నమోదయ్యాయి. శబ్దకాలుష్యం 70 డీబీ మించితే ప్రమాదకరం.