గూగుల్ మ్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎయిర్ క్వాలిటీ వివరాలు

గూగుల్ మ్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎయిర్ క్వాలిటీ వివరాలు

 న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇక నుంచి గాలి క్వాలిటీ సమాచారాన్ని పొందవచ్చని, ఇందుకోసం ఎయిర్ వ్యూ ప్లస్ ​ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చామని గూగుల్ ​ప్రకటించింది.    ఈ వారం   ఢిల్లీ  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కంపెనీ ఈ ప్రకటన చేసింది.  వాయు కాలుష్యం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోందని గూగుల్​ పేర్కొంది. వెదర్​​సెన్సర్లు వివిధ గాలి నాణ్యత పారామితులను, పీఎం 2.5, పీఎం10, సీఓ2, ఎన్​ఓ2, ఓజోన్ వీఓసీ, ఉష్ణోగ్రత,  తేమను కొలుస్తాయి.  గాలి నాణ్యత తగ్గితే చిన్న పిల్లలు లేదా వృద్ధుల వంటి వాళ్లు తప్పనిసరిగా ముఖానికి మాస్క్​ ధరించాలని సూచించింది.