ఐరా లయన్స్‌‌‌‌ బోణీ

ఐరా లయన్స్‌‌‌‌ బోణీ

హైదరాబాద్‌‌‌‌: బౌల్డర్‌‌‌‌ హిల్స్‌‌‌‌ వేదికగా జరుగుతున్న ఆరో రియాల్టీ టీ9 చాలెంజ్‌‌‌‌ గోల్ఫ్‌‌‌‌ టోర్నీలో ఐరా లయన్స్‌‌‌‌ అదిరిపోయే బోణీ కొట్టింది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న టోర్నీలో పోటీల తొలి రోజైన బుధవారం జరిగిన గ్రూపు–ఎ మ్యాచ్‌‌‌‌లో ఐరా లయన్స్‌‌‌‌ 3–-1తో నోవాటెల్‌‌‌‌ స్టార్స్‌‌‌‌పై విజయం సాధించింది. మరో పోరులో టూటోరూట్‌‌‌‌ 2–-1తో బంకర్‌‌‌‌ బస్టర్స్‌‌‌‌పై గెలిచింది.

గ్రూపు-–బిలో  కైన్‌‌‌‌ డైరీ 4–-0తో బాష్‌‌‌‌ ఆన్‌‌‌‌పై, ఫెయిర్‌‌‌‌వే ఫాల్కన్స్‌‌‌‌ 3-–1తో గోల్కోండ గాలంట్‌‌‌‌ గోల్ఫర్స్‌‌‌‌పై, గ్రూపు–సిలో లావిస్టా క్రూసెడర్స్‌‌‌‌ 3–1తో సెమెంట్రిక్స్‌‌‌‌పై, పర్‌‌‌‌-–ఫెక్షనిస్ట్స్‌‌‌‌ 3–-1తో వాంటేజ్‌‌‌‌ వారియర్స్‌‌‌‌పై గెలిచి ముందంజ వేశాయి. గ్రూపు–డిలో శ్రీనిధి దక్కన్‌‌‌‌ వారియర్స్‌‌‌‌ 3–-1తో ఎఫ్‌‌‌‌జీ వారియర్స్‌‌‌‌పై గెలవగా, సమ్మర్‌‌‌‌ స్ట్రోమ్‌‌‌‌, ఆరో వారియర్స్‌‌‌‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌‌‌ 2–2తో డ్రా అయ్యింది.