శంషాబాద్లో ఎయిర్ ​ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్లో ఎయిర్ ​ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్, వెలుగు: ఎయిర్ ఏషియా విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. టెక్నికల్ ఇష్యూతోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని తెలుస్తోంది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి హైదబాబాద్​కు విమానం వస్తుంది. 

విమానం గాల్లో ఉండగానే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే శంషాబాద్ ఏటీసీకీ సమాచారమందించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్​కు వారు అనుమతి ఇవ్వడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 737 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ పోర్టు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.