ఎయిర్ బస్​బెలుగా మళ్లొచ్చింది!.

ఎయిర్ బస్​బెలుగా మళ్లొచ్చింది!.

వెలుగు, శంషాబాద్: ‘వేల్​ఆఫ్​ది స్కై’గా ఫేమస్ అయిన ఎయిర్ బస్ ​‘బెలుగా’ గురువారం అర్ధరాత్రి తర్వాత శంషాబాద్ ఎయిర్​పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్​పోర్టు సిబ్బంది స్పెషల్​పార్కింగ్​ ఏర్పాటు చేశారు. మస్కట్ నుంచి మలేషియా వెళ్తున్న ఈ కార్గో ఫ్లైట్ ఫ్యుయెల్ కోసం శంషాబాద్‎లో దిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తిరిగి థాయిలాండ్ బయలుదేరి వెళ్లింది. బెలుగా గంటకు 1,650 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో దూసుకెళ్తుంది. దీని బ్యాగేజ్​లోడింగ్​కెపాసిటీ 40 టన్నులు. పొడవు 5,616 మీటర్లు, ఎత్తు1,725 మీటర్లు ఉంటుంది.