ఇండియన్ కంపెనీకి ఎయిర్‌‌‌‌బస్‌‌ విమానాల డోర్ల తయారీ  కాంట్రాక్ట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  ‘మేక్ ఇన్‌‌ ఇండియా’ ఇనీషియేటివ్‌‌లో భాగంగా ఎయిర్‌‌‌‌బస్‌‌  ఇండియన్ కంపెనీ డైనమిక్ టెక్నాలజీస్‌‌కు అతిపెద్ద ఆర్డర్ ఇచ్చింది. కంపెనీకి చెందిన ఏ220 విమానాల్లో డోర్లను ఈ బెంగళూరు కంపెనీ  తయారు చేయనుంది. ఏరో స్పేస్ సెక్టార్‌‌‌‌లో ఇది అతిపెద్ద ఎక్స్‌‌పోర్ట్ కాంట్రాక్ట్ కావడం విశేషం. అగ్రిమెంట్ ప్రకారం, డైనమిక్ టెక్నాలజీస్‌‌  కార్గో, ప్యాసింజర్‌‌‌‌, సర్వీస్‌‌ విమానాల డోర్లను తయారీ, అసెంబుల్ చేస్తుంది. ఏ220 విమానాల్లో ఎనిమిది డోర్లు ఉంటాయి.  ఈ కాంట్రాక్ట్‌‌తో ఇతర ఇండియన్ కంపెనీలకు అవకాశాలు క్రియేట్‌‌ అవుతాయి. కిందటేడాది ఏ320 విమానాల కోసం బల్క్‌‌, కార్గో డోర్లను తయారు చేయడానికి టాటా అడ్వాన్స్డ్‌‌  సిస్టమ్స్‌‌కు ఎయిర్‌‌‌‌బస్‌‌ ఆర్డర్ ఇచ్చింది.