బెంగళూరు విమానానికి బాంబు బెదిరింపు.. ఫ్లైట్లో 184 మంది ప్రయాణికులు..

బెంగళూరు విమానానికి బాంబు బెదిరింపు.. ఫ్లైట్లో 184 మంది ప్రయాణికులు..

ఢిల్లీ: భారత్లో రాకపోకలు సాగిస్తున్న పలు విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఆకాసా ఎయిర్ ఫ్లైట్ QP1335 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో టేకాఫ్ అయిన విమానం తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఇండిగో ముంబై టూ ఢిల్లీ 6E 651 విమానం కూడా ఇదే తరహా కారణంతో అహ్మదాబాద్కు మళ్లించారు. ఇండిగో ఫ్లైట్ 6E 74 (రియాద్ టూ ముంబై) కూడా భద్రతాపరమైన కారణాలతో మస్కట్కు మళ్లించారు. 6E 515 (చెన్నై టూ లక్నో) విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడం గమనార్హం. 6E 1011 (ముంబై టూ సింగపూర్) విమానానికి కూడా సెక్యూరిటీ సంబంధిత అలర్ట్ వచ్చింది. దర్భంగా టూ ముంబై, లేహ్ టూ ఢిల్లీ రూట్లలో ప్రయాణం సాగించిన రెండు స్పైస్జెట్ విమానాలకు కూడా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది.

ALSO READ | అదృష్టం బాగుంది: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ హెలికాఫ్టర్ పొలాల్లో దిగింది..!

దర్భంగా నుంచి ముంబై వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG116), సిలిగురి నుండి బెంగళూరు బయలుదేరిన అకాశ ఎయిర్ (SG116) విమానాలది అదే పరిస్థితి. ఢిల్లీ నుంచి చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో.. భద్రతా తనిఖీల నిమిత్తం కెనడాకు దారి మళ్లించారు.

అక్టోబర్ 15, 2024న ఒక్కరోజే ఏడు బాంబు బెదిరింపు కాల్స్ రావడం విమానయాన శాఖను బెంబేలెత్తించింది. మూడు రోజుల్లో 12 బెదిరింపు కాల్స్ రావడం ఆందోళన కలిగించింది. బెదిరింపు కాల్స్ వచ్చిన అన్ని సందర్భాల్లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఏవియేషన్ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు సివిల్ ఏవియేషన్ అధికారులు.. భారత సైబర్-సెక్యూరిటీ ఏజెన్సీలు, పోలీసుల సహాయాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు.