నోటిఫికేషన్ విడుదల : ఎయిర్‌‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్

నోటిఫికేషన్ విడుదల : ఎయిర్‌‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్‌ బ్రాంచ్‌ లో షార్ట్ సర్వీస్ కమీషన్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్‌ , నాన్ టెక్నికల్‌ ) బ్రాంచ్‌ లో పర్మనెంట్ కమిషన్‌‌లలో ఎంట్రీకి నిర్వహించే ఎయిర్‌‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యా ట్ 2019) ప్రకటన విడుదల చేసింది. 2020 జూలైలో ప్రారంభమయ్యే ఈ కోర్సు
ద్వారా 242 ఉన్నత స్థాయి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఏటా మే/ జూన్‌ , డిసెంబరు నెలల్లో రెండు సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులోనే ఎన్‌ సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటిరాలజీ ఎంట్రీ కలిపి ఉన్నాయి. ఆన్‌ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు: ఫ్లైయిగ్(ఎస్ఎస్‌‌సీ)–60, గ్రౌండ్ డ్యూటీ (పర్మనెం ట్)–40, గ్రౌండ్ డ్యూటీ (ఎస్ఎస్సీ)–62, అడ్మిన్ –40, ఎడ్యుకేషన్–16, మెటిరాలజీ(పర్మనెం ట్)–10, మెటిరాలజీ(ఎస్ఎస్సీ)–14; అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ తో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి (టెక్నికల్ పోస్టులకు మాత్రమే) నిర్దేశించిన శారీరక ప్రమాణాలు, ఎన్‌ సీసీ సర్టిఫికెట్ తప్పనిసరి.

వయసు: 2020 జూలై 1 నాటికి ఫ్లైయింగ్‌‌ బ్రాంచ్‌ పోస్టులకు 20 నుంచి 24 ఏళ్లు, మిగిలినవాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ.250 కాగా మిగిలిన విభాగాలకు ఫీజు లేదు. సెలెక్షన్ ప్రాసెస్: కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్‌‌ల ద్వారా ఎంపిక చేస్తారు. శిక్షణ: ఎంపికయిన వారికి 2020 జూలైలో ప్రారంభమయ్యే కోర్సు ద్వారా ఫ్లైయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ అభ్యర్థులకు ఏడాదిన్నర, మిగిలిన వారికి సంవత్సరం పాటు హైదరాబాద్‌ లోని దుండిగల్‌‌లో ఉన్న ఎయిర్‌‌ఫోర్స్  అకాడమీలో శిక్షణ ఇస్తారు. ట్రైనిం గ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఫ్లైయింగ్ ఆఫీసర్ ర్యాంక్ తో పాటు నెలకు 75 వేలకు
పైగా వేతనాలు, ఇతర అలవెన్సులు అందిస్తారు.

దర ఖాస్తులు ప్రారంభం: 2019 జూన్ 1
చివ రితేది: 2019 జూన్ 30
వెబ్‌‌సైట్: www.afcat.cdac.in/
AFCAT