గాలి అవసరం లేని టైర్లు వచ్చేస్తున్నాయ్
అదేంటి ట్యూబ్‌లెస్ టైర్స్ తెలుసు కానీ… ఈ ఎయిర్‌లెస్ టైర్స్ ఏంటీ అనుకుంటున్నారా? జపాన్‌కు చెందిన బ్రిడ్జ్‌స్టోన్ కంపెనీ వీటిని తయారు చేస్తోంది. ఈ కొత్త డిజైన్‌లో ప్రెజర్డ్ ఎయిర్‌కు బదులు రీసైకిల్డ్ థర్మో ప్లాస్టిక్ తో టైర్లను సిద్ధం చేస్తోంది. ‘వెబ్’ గా పేర్కొంటున్న ఈ టైర్ల తయారీకి ఒక్కో దానికి 5వేల పౌండ్లు ఖర్చు కానుంది. తొలుత చిన్న, తేలికైన సైకిళ్ల కోసం ఈ టైర్లను విడుదల చేయనుంది. ఈ ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో ఎయిర్ లెస్ టైర్ల బైక్‌ను ప్రదర్శించేందుకు బ్రిడ్జి స్టోన్ సిద్ధమవుతోంది. ఇటీవల లాస్ వెగాసలో జరిగిన కన్జ్యూమర్ఎలక్ట్రానిక్స్ షోలో ఈ డిజైన్లను విడుదల చేసింది. సైకిల్స్, కమర్షియల్ ట్రక్స్ కోసం ఈ టైర్లను తయారు చేస్తోంది. ‘‘ట్రెడిషనల్ టైర్స్ లాగే ఇవి పని చేస్తాయి. కమర్షియల్ ట్రక్కులకు చాలా ఉపయుక్తం. ఫ్లీట్ ఆపరేటర్స్ వీటి కోసం మమ్మల్ని అడుగుతున్నారు. ఈ టెక్నాలజీ వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది. అదే విధంగా ప్రతి 8 వేల మైళ్లకు ట్రక్కులకు గాలి సమస్య వస్తుంది. ఈ టైర్లతో ఇక గాలి సమస్య ఉండదు” అని కంపెనీకి చెందిన జాన్ కింపెల్ తెలిపారు. ప్రస్తుతమున్న టైర్లతో పోలిస్తే ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని, ఎక్కువ కాలం మన్నుతుందని, ధర కూడా తక్కువేనని పేర్కొన్నారు.
For Municipal Elections Results See Here