రికవరీ కాలేకపోతున్న విమాన కంపెనీలు

ఫ్రీ కరోనా లెవెల్స్‌‌కు ఎప్పుడొస్తాయన్నది ప్రశ్నార్థకం
ప్రభుత్వం నుంచి సపోర్ట్ అంతంతమాత్రమే
ఆదుకోవాలంటోన్న ఎయిర్‌ లైన్స్

బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా ముందు వరకు ఒక వెలుగు వెలిగిన ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ లాక్‌‌డౌన్ ఆంక్షలు సడలించినా ఇంకా రికవరీ కాలేకపోతుంది. ఈ సెక్టార్ రికవరీకి మరికొన్ని నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్నేషనల్‌‌గా విమానాల రాకపోకలకు ఇంకా ఆంక్షలు కొనసాగుతుండటం.. కరోనా భయానికి ప్రజలు ఎక్కడికీ ప్రయాణాలు చేయకపోతుండటంతో మన ఏవియేషన్ సెక్టార్ ప్రీ కరోనా స్థాయిలకు చేరుకోలేకపోతుంది. కరోనా ముందు వరకు డబుల్ డిజిట్ గ్రోత్‌‌తో.. ప్యాసెంజర్ ట్రాఫిక్‌‌తో ఎప్పుడూ బిజీగా ఉండేది. కానీ కరోనాతో ఈ సెక్టార్ కుప్పకూలింది. లాక్‌‌డౌన్‌‌తో ఎక్కడిక్కడ ఫ్లయిట్స్ అన్ని ఆగిపోయాయి. ఓన్లీ కార్గో ఆపరేషన్స్, ఎసెన్షియల్ కమోడిటీస్‌‌కు తప్ప మరే అవసరానికి ఫ్లయిట్స్ తిరగలేదు. అంతేకాక ఎయిర్‌‌‌‌లైన్స్ వద్దనున్న క్యాష్ రిజర్వ్‌‌లన్ని ఫిక్స్‌‌డ్ కాస్ట్‌‌లను చెల్లించడానికే సరిపోయింది.

మేలో ఆంక్షలు సడలించినా కరోనా ముందు తిరిగినట్టు విమానాలు ఎగరడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే.. ఈ సెక్టార్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఇండస్ట్రీ ఇంకా ఎకనమిక్ డౌన్‌‌టర్న్, లో అక్యుపెన్సీతోనే సతమతమవుతుందని.. ఆపరేషన్స్ ఎప్పుడు ప్రీ కరోనా లెవెల్స్‌‌కు వస్తాయో తెలియడం లేదని పేర్కొన్నాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం కరోనాకు ముందు ప్రతి రోజూ సగటున 3.5 లక్షల మంది ప్యాసెంజర్లు రాకపోకలు సాగించేవారు.

కానీ ఇప్పుడు 2,25,000 మంది ప్యాసెంజర్లే విమానాలను ఎక్కుతున్నారు.  తమ ఆపరేషన్స్ సాధారణ స్థితికి రావడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుందని విస్తారా కూడా చెబుతోంది. విస్తారా ప్రస్తుతం ప్రీ కరోనా లెవెల్స్‌‌కి 55 శాతం కెపాసిటీతో ఆపరేట్ అవుతోంది.  మరోవైపు ప్రీ కరోనా లెవెల్స్‌‌కి ఇండస్ట్రీ రాకపోతుండటంతో.. దేశీయ ఎయిర్‌‌‌‌లైన్ ఇండిగో వేతన కోతలతో పాటు ఇతర ఖర్చులను తగ్గిస్తోంది. ప్యాసెంజర్లు తగ్గిపోయారు…

2019 ఆగస్ట్‌‌లో దేశీయ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ 117.93 లక్షల మంది ప్యాసెంజర్లను క్యారీ చేశాయి. కానీ 2020 ఆగస్ట్‌‌ నాటికి ఈ సంఖ్య 76 శాతం పడిపోయి 28.32 లక్షలకు తగ్గింది. లాక్‌‌డౌన్‌లో అయితే ఈ సంఖ్య జీరోగా ఉంది. 2020 జనవరి నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో మొత్తంగా దేశీయ ఎయిర్‌‌‌‌లైన్స్ క్యారీ చేసిన ప్యాసెంజర్ల సంఖ్య 401.17 లక్షలుగా ఉంది. ఇది అంతకుముందు ఏడాది 943.58 లక్షలుగా ఉంది.

అంటే గతేడాదితో పోలిస్తే ప్యాసెంజర్ల సంఖ్య 57.48 శాతం తగ్గింది. ఏవియేషన్ ఇండస్ట్రీకి లిక్విడిటీ మరో పెద్ద సమస్యగా ఉంది. ఇతర సెక్టార్లతో పోలిస్తే ఏవియేషన్ సెక్టార్ రికవరీకి ఎక్కువ కాలం పట్టేలా ఉందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌‌లన్నారు. ఏప్రిల్–జూన్ కాలంలో ఎయిర్‌‌‌‌లైన్స్ కంపెనీల నష్టాలు కూడా బాగా పెరిగాయి. ఇండిగో నష్టాలు రూ.2,844.3 కోట్లుగా.. స్పైస్‌‌జెట్ నష్టాలు రూ.593.4 కోట్లుగా ఉన్నట్టు ఆయా కంపెనీలు పోస్ట్ చేశాయి. 2020 ఎయిర్‌‌‌‌లైన్స్ నష్టాలు 2 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ఇవి 2021 నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ ఇండియా చెబుతోంది.

కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్, డొమెస్టిక్ ఫ్లయిట్స్‌‌పై నిర్ణయం తీసుకుంటుందని ఏవియేషన్ మంత్రి హర్‌‌‌‌దీప్ సింగ్ పురి తెలిపారు. ఎయిర్ ట్రావెల్ అనేది అత్యంత సురక్షితమైన ట్రావెల్ అని, కానీ ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రం అంతంతమాత్రంగానే ఉందని పురి అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మల తాజాగా ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజీల్లో తమ సెక్టార్ కోసం కూడా ప్రకటనలు వస్తాయని భావించామని, కానీ అలా జరగలేదని పేర్కొన్నారు.

5 బిలియన్ డాలర్ల ఫండింగ్ కావాలి…

ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడంపై ఎక్కువ ఫోకస్ చేసిందని సీఏపీఏ ఇండియా సౌత్ ఆసియా సీఈవో కపిల్ కౌల్ అన్నారు. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే 4.5 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు ఫండింగ్ కావాలని సీఏపీఏ కన్సల్టెన్సీ అంచనావేస్తోంది. ఈ సెక్టార్‌‌‌‌కు ప్రభుత్వ సహకారం మరింత ఉండాలని ఎయిర్‌‌‌‌లైన్ ఎగ్జిక్యూటివ్‌‌లు చెబుతున్నారు. ఏటీఎఫ్‌‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని, ఏటీఎఫ్ వ్యాట్‌‌ను తగ్గించాలని ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు ఇండస్ట్రీ వర్గాలు విన్నపించుకున్నాయి. ఏటీఎఫ్‌‌ ఎక్సైజ్ డ్యూటీపై ఒక ఏడాది పాటు ఇచ్చిన హాలిడేను స్వాగతిస్తున్నట్టు ఇండిగో దుత్తా తెలిపారు. మరోవైపు ఎన్ని సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రజలు నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ కోసం విమానాన్ని ఎక్కడం లేదు. ఆంక్షలు ఎత్తివేసినా వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చ్యువల్ మీటింగ్‌‌లు బిజినెస్ ట్రావెల్‌‌ను తగ్గించాయి. కరోనా ప్రభావం ఈ సెక్టార్‌‌‌‌పై 2021లో మరింత కనిపిస్తుందని ఎక్స్‌‌పర్ట్‌‌లు అంటున్నారు.  వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ అనిశ్చిత కొనసాగుతుందని పేర్కొన్నారు.

For more News….

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు