
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్స్అథారిటీ ఆఫ్ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్స్అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 18వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు 83: జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీస్) 13, జూనియర్ ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రిసోర్సెస్) 66, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) 4.
ఎలిజిబిలిటీ: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 2025, మార్చి 18 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. బీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్లు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్. ఫీజు: రూ.1000.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.