
న్యూఢిల్లీ: బంగారాన్ని తరలించేందుకు విచిత్రమైన ప్లాన్లు వేస్తుంటారు కొందరు స్మగ్లర్లు. తాజాగా ఖర్జూర పండ్లలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్అధికారులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
56 ఏండ్ల వయస్సు ఉన్న ప్రయాణికుడు జెడ్డా నుంచి ఢిల్లీకి ఎస్వీ 756 విమానంలో వచ్చాడు. చెకింగ్ టైంలో అతని లగేజీపై అనుమానం రాగా.. పండ్లు ఉన్న మూటను ఓపెన్ చేసి పరిశీలించారు. అయితే ఆ పండ్లలో బంగారు ముక్కలను అమర్చినట్లు కస్టమ్స్ఆఫీసర్లు గుర్తించారు.
అతని వద్ద నుంచి సుమారు 172 గ్రాముల బంగారన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.