- అయ్యప్ప భక్తులకు ఏఏఐ శుభవార్త
చెన్నై: శబరిమల అయ్యప్ప భక్తులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) శుభవార్త వినిపించింది. శబరిమలకు వెళ్లే మాలధారులు విమానాల్లో ‘ఇరుముడి’ తో ప్రయాణించొచ్చని తెలిపింది. అందులో కొబ్బరికాయలను తమ వెంట తీసుకెళ్లొచ్చని చెప్పింది. అయ్యప్ప స్వాముల నుంచి వచ్చిన వినతి మేరకు వారి సౌకర్యార్థం ఈ మేరకు నిబంధనలను సడలించామని పేర్కొంది. అక్టోబర్ 28 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ఈ సడలింపు వచ్చే ఏడాది జనవరి 20 వరకు చెల్లుబాటవుతుం దని వివరించింది. ప్రయాణం సాఫీగా, సేఫ్‌గా జరగడానికి అన్ని కొబ్బరికాయలను ఎయిర్ పోర్టులోని భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారని వెల్లడించింది. కొబ్బరికాయలను క్యాబిన్లోకి తీసుకెళ్లే ముందు ఎక్స్ రే, ఎక్స్‌ప్లోజివ్ ట్రేస్ డిటెక్షన్ (ఈటీడీ), భౌతిక తనిఖీలు ఉంటాయని తెలిపింది.