
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ ఆఫీసుల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు: మొత్తం490 పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 90, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 106, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు ఉండాలి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 2 నుంచి మే 1 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.aai.aero వెబ్సైట్లో సంప్రదించాలి.