హుస్సేన్ సాగర్ వద్ద శుక్రవారం నిర్వహించిన ఎయిర్ షో అబ్బురపరిచింది. అరగంట సేపు సాగిన విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సూర్య కిరణ్ ఎయిర్ఫోర్స్ అకాడమీకి చెందిన 9 విమానాలతో మధ్యాహ్నం 4 గంటల నుంచి 4. 30 వరకు ఎయిర్ షో కొనసాగింది. వెయ్యి మందికి పైగా పబ్లిక్ ట్యాంక్ బండ్ కి తరలివచ్చి ఆసక్తిగా షోను తిలకించారు.
సెల్ఫోన్లలో విన్యాసాలను బంధించారు. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా నిర్వహించిన ఈ ఎయిర్ షో కు విశేష స్పందన వచ్చింది. 8వ(ఆదివారం) తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య మళ్లీ ఎయిర్ షో ఉంటుందని అధికారులు తెలిపారు